Tuesday, February 5, 2013

Telugu Movie Song : Gulabi

పల్లవి:
ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను ♥
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా 
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను ♥
నీ స్పర్శే ఈ వీచే గాలుల్లో ♥
నీ రూపే నా వేచే గుండెల్లో ♥
నిన్నటి నీ స్వప్నం నన్ను నడిపిస్తూ ఉంటే ♥
ఆ నీ నీడై వస్తాను ఎటువైపున్నా ♥
నీ కష్టంలో నేను ఉన్నాను ♥
కరిగే నీ కన్నీరవుతా నేను ♥
చెంపల్లో కారి , నీ గుండెల్లో చేరి ♥
నీ ఏకాంతంలో ఓదార్పౌతాను ♥ ♥ ♥

చరణం:
కాలం ఏదో గాయం చేసింది
నిన్నే మాయం చేసానంటోంది
లోకం నమ్మి అయ్యో అంటోంది
శోకం కమ్మి జోకొడతానంది
గాయం కోస్తున్నా నే జీవించే ఉన్నా
ఈ జీవం నీవని సాక్షం ఇస్తున్నా ♥
నీతో గడిపిన ఆ నిమిషాలన్ని
నాలో మోగే గుండెల సవ్వడులే ♥
అవి చెరిగాయంటే నే నమ్మేదెట్టాగా ♥
నువ్వే లేకుంటే నేనంటూ ఉండనుగా ♥ ♥ ♥

నీ కష్టంలో నేనూ ఉన్నాను ♥
కరిగే నీ కన్నీరవుతా నేను ♥
చెంపల్లో కారి నీ గుండెల్లో చేరి ♥
నీ ఏకాంతంలో ఓదార్పౌతాను ♥ ♥ ♥

♥ ఏ రోజైతే చూసానో నిన్ను ఆ రోజే నువ్వైపోయా నేను ♥
కాలం కాదన్నా ఏ దూరం అడ్డున్నా
నీ ఊపిరినై నే జీవిస్తున్నాను ♥ ♥ ♥

చిత్రం: గులాబి
రచన: సిరివెన్నెల
సంగీతం: శశి ప్రీతమ్
గానం: శశి ప్రీతమ్