Sunday, March 17, 2013

Telugu Song : Sahasame

పల్లవి : 

సాహసమే చేయ్‌రా డింభకా
అన్నది కదరా పాతాళభైరవి


చొరవగా దూకకపోతే సాధించలేవురా
నువ్వనుకున్నది


ధైర్యముంటే హహ్హహ్హా
దక్కుతుంది హహ్హహా రాకుమారి

తెలివిగా వేయ్‌రా పాచిక
కల్లో మేనక ఒళ్లోపడదా

సులువుగా రాదురా కుంక
బంగారు జింక వేటాడాలిగా
నింగిదాకా హహ్హహ్హా నిచ్చెనేద్దాం హహ్హహ్హా
ఎక్కిచూద్దాం హహ్హహ్హా ఒహ్హొహో...

చరణం : 1

చందమామను అందుకొనే
ఇంద్ర భవనాన్ని కడతానురా
పడవంత కారులోన బజారులన్నీ
షికారు చేస్తానురా

సొంతమైన విమానములో
స్వర్గలోకాన్ని చూడతానురా
అపుడు అప్సరసలు ఎదురువచ్చి
కన్ను కొడతారురా
చిటికేస్తే హహ్హహ్హా సుఖమంతా హహ్హహ్హా
మనదేరా ॥