Tuesday, April 15, 2014

Telugu Movie Song : Prema Katha : Devudu Karunhistadani


పల్లవి: 
దేవుడు కరుణిస్తాడని, వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు 
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధం వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈ పైనా
కడదాక సాగనా

చరణం:
నువ్వు ఉంటేనే వుంది నా జీవితం ఈ మాట సత్యం
నువ్వు జంటైతే బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగా నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం , నువ్వే నాకోసం
ఎవరేమి అనుకున్నా....

చరణం:
ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరే వరకు
ఎటెళ్ళేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వు నీ నవ్వు నాతో లేకుంటే
నేనంటు ఉంటానా.....

చిత్రం: ప్రేమ కథ
రచన: సిరి వెన్నెల
సంగీతం: సందీప్ చౌతా
గానం: రాజేష్ , అనురాధా శ్రీరామ్

           

Pallavi:
Devudu karunisthadani varamulu kuripisthadani..
Nammaledu naku nee preme dorikevaraku..
Swargam okatuntundani antha antunte vini..
Nammaledu nenu nee needaku chere varaku..
Okariki okarani munduga rase unnado..
Manasuna manasai bandham vese unnado..
Emo emaina neetho eepaina kadadhaka sagana..

Charanam:
Nuvvu untene undi na jeevitham..
Ee mata satyam..
Nuvvu jantaithe brathukulo prathi kshanam..
Sukhamega nithyam..
Pade pade nee pere pedhavi palavaristhondi..
Ide mata gundello sada moguthu undi..
Nene neekosam nuvve nakosam evaremi anukunna..

Devudu Karunisthadani..

charanam:
Premane matakardhame theliadu..
Innalla varaku..
Manasulo unna alajade theliyadu..
Ninu cherevaraku..
Etelledo jeevitham nuve lekapothe..
Edariga maredo nuve rakapothe..
Nuvvu nee navvu natho lekunte nenatu untana..

Devudu Karunisthadani..

Chitram : Prema Katha
Sahityam : Sirivennela
Sangeetham: Sandeep Chowtha
Gaanam: Rajesh, Anuradha sriram